Renu Desai | పొలిటికల్ ఎంట్రీపై రేణు దేశాయ్​ క్లారిటీ..

Renu Desai | పొలిటికల్ ఎంట్రీపై రేణు దేశాయ్​ క్లారిటీ..తన జాతకంలోనే..
Renu Desai | పొలిటికల్ ఎంట్రీపై రేణు దేశాయ్​ క్లారిటీ..తన జాతకంలోనే..

అక్షరటుడే, హైదరాబాద్: Renu Desai | రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం గతంలోనే వచ్చిందని, పిల్లల కోసం వదులుకున్నట్లు ప్రముఖ నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ (Renu Desai) చెప్పుకొచ్చారు. ఓ పాడ్​కాస్ట్ లో podcast తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు. “రాజకీయాల్లోకి politics entry Renu desai ఎంట్రీ అనేది నా జాతకంలోనే ఉంది. గతంలోనే ఓసారి అవకాశం వచ్చింది. కేవలం పిల్లల కోసమే ఆ అవకాశాన్ని వదులుకున్నా. ఇప్పటికీ నాది అదే అభిప్రాయం. ప్రస్తుతం నేను విధిరాతకు వ్యతిరేకంగా వెళ్తున్నా” అని అన్నారు.

Advertisement

రాజకీయాలు అంటే ఇష్టమేనా..? అన్న ప్రశ్నకు సమాధానంగా.. “సామాజిక సేవ social service చేయడంలోనే నాకు ఆనందం ఉంది. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని భావిస్తా. మన దేశంలో డబ్బు, ఆహారానికి లోటు లేదు. ఒకవేళ నేను ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరితే తప్పకుండా ప్రకటిస్తా. అది రహస్యంగా దాచేది కాదు. నా స్నేహితులు, పిల్లలతో నేను ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తుంటా. రాజకీయాల్లో నేను ఇమడలేమోనని అనిపిస్తుంటుంది” అని నవ్వుతూ చెప్పారు.

Advertisement