అక్షరటుడే, కామారెడ్డి టౌన్: అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చించాలని కోరుతూ భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కోరారు. శనివారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. రూ. రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా తదితర సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని విన్నవించారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనంద్ రావు, జోనల్ అధ్యక్షుడు లొంక వెంకట్ రెడ్డి, బీకేఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.