అక్షరటుడే, ఆర్మూర్ : మండలంలోని అంకాపూర్ గ్రామాన్ని ఒడిశా రాష్ట్ర ప్రజాప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. ఒడిశాకు చెందిన సర్పంచులు, జెడ్పిటీసీలు, మండల స్థాయి అధికారులు అంకాపూర్ గ్రామంలో సాగు చేస్తున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అంతర పంటల సాగు నీటి యాజమాన్య పద్ధతులు, విత్తన శుద్ధి ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్మూర్ వ్యవసాయాధికారి హరికృష్ణ, ఎంపీవో శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి హారిక, భాజన్న, ఒడిశా ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.