Advertisement
అక్షరటుడే, ఇందూరు: నగరంలోని ఆర్మూర్ రోడ్ ఆర్టీసీ కాలనీలో ఆదివారం ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠాపన నిర్వహించనున్నట్లు ఆలయకమిటీ ప్రతినిధులు తెలిపారు. 12 అడుగుల ఎత్తులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కాలనీకి చెందిన గుజ్జుల అనిత హన్మంత్‌రెడ్డి దంపతులు అందజేశారని పేర్కొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం అన్నదానం ఉంటుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.
Advertisement