అక్షరటుడే, హైదరాబాద్: SLBC టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సహాయక చర్యల్లో NDRF, SDRF, ఆర్మీ, నేవీ బృందాలు పాల్గొంటున్నాయి. కాగా.. ప్రమాద సమయంలో టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో వారు ప్రాణంతో భయటపడతారనే ఆశలు సన్నగిల్లాయి.
SLBC టన్నెల్‌లో ప్రమాదం జరుగగా అందులో కార్మికులు చిక్కుకున్నారు. ఇప్పటికే రెండ్రోజులు ముగిసింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా టన్నెల్ బోరింగ్ మెషీన్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. దాని విడి భాగాలు టన్నెల్‌లో చెల్లాచెదురుగా పడిపోయాయి. టన్నెల్‌లో పెరుగుతున్న బురద ప్రవాహం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. భారీ మోటార్లతో వాటర్ పంపింగ్ చేస్తున్నారు. 12 కి.మీ వరకు లోకో ట్రైన్‌లో రెస్క్యూ టీమ్ ప్రయాణం సాగించగలిగింది. ఆ తర్వాత కన్వేయర్ బెల్ట్‌పై 1.5 కి.మీ నడిచి వెళ్లింది. రెస్క్యూ టీమ్ రాకపోకలతో కన్వేయర్ బెల్ట్ వదులుగా అవుతోంది. ఏ క్షణమైనా బెల్ట్ ఊడిపోయే ప్రమాదం పొంచిఉంది.
హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్ ఎస్‌ఎల్‌బీసీకి బయలుదేరారు. ఇప్పటికే టన్నెల్ దగ్గర సమస్యపై అధికారులతో మాట్లాడారు. తాజా పరిస్థితిని ఆయన ఆయన సమీక్షించనున్నారు. ఆ తర్వాత మీడియాకు కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.