అక్షరటుడే, ఇందూరు: Telangana Jagruti | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(mlc Kavitha) పోరాట ఫలితంగానే నేడు బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావు పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కవిత పోరాటంతోనే రెండు వేరువేరు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని వివరించారు.
Telangana Jagruti | బీసీలకు మొదటి నుంచీ అన్యాయమే..
బీసీలు రాష్ట్రంలో మొదటి నుంచి అన్యాయమే జరుగుతోందని అవంతిరావు పేర్కొన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్లకు కలిపి ఒకే బిల్లు పెడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని జాగృతి వాదిస్తూ వచ్చిందన్నారు. వేర్వేరు బిల్లులు పెట్టాలని కేవలం ఎమ్మెల్సీ కవిత మాత్రమే పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, డాక్టర్ పులి జైపాల్, పంచరెడ్డి మురళి, శ్యామల సాయికృష్ణ, హరీష్, ఆకాష్, తదితరులు పాల్గొన్నారు.