అక్షరటుడే, ఇందూరు:MLA Dhanpal | విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(MLA Dhanpal Suryanarayana Guptha) అన్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లో పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్(Pensioners and Retired Persons Association) నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగురాలు గుర్నాల సరోజినమ్మను ఆదర్శంగా తీసుకోవాలన్నారు.
విశ్రాంత ఉద్యోగుల కోసం యోగా కేంద్రం(Yoga center), లైబ్రరీ(Library) ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు సమకూర్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ధన్పాల్ లక్ష్మీబాయి, విఠల్ గుప్త చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుర్చీలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ దశరథ్ జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.