అక్షరటుడే, వెబ్డెస్క్: KTR | రేవంత్రెడ్డి ప్రభుత్వం Revanth Reddy government కంచ గచ్చిబౌలి భూముల్లోని Kancha Gachibowli lands చెరువును కూడా తాకట్టు పెట్టి రుణం తీసుకుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన హెచ్సీయూ భూముల HCU lands విషయమై మీడియాతో మాట్లాడారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల విషయంలో రూ.10 వేల కోట్ల స్కామ్ జరిగిందని తాను చెప్పిందే నిజమైందన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు నియమించిన సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ Central Empowerment Committee కూడా ఇక్కడ జరిగిన అక్రమాలు, ఆర్థికపరమైన అవకతవకలపై విచారణ జరపాలని బుధవారం నివేదిక ఇచ్చిందన్నారు. దీనిపై స్పెషలైజ్డ్ ఏజెన్సీ ద్వారా ఇండిపెండెంట్ ఇన్విస్టిగేషన్ టీంను independent investigation team ఏర్పాటు చేయాలని సూచించిందని కేటీఆర్ తెలిపారు. ఈ కుంభకోణం బయటకు రావాలంటే ఆర్బీఐ RBI కూడా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
KTR | విచారణకు ఆదేశించాలి
హెచ్సీయూ భూముల వ్యవహారంలో ప్రధాని మోదీ Prime Minister Modi విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని కేటీఆర్ KTR ప్రశ్నించారు. ఈ భూముల్లో రేవంత్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని హర్యానాలో Haryana మోదీ మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. విధ్వంసం గురించి మాట్లాడిన మోదీ చర్యలు ఎందుకు చేపట్టడం లేదన్నారు. ప్రధానికి Prime Minister చిత్తశుద్ధి ఉంటే ఈ కుంభకోణంపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.