CM Revanth | ప్రభుత్వ బడులపై రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth | ప్రభుత్వ బడులపై రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth | ప్రభుత్వ బడులపై రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : CM Revanth | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరకపోవడంపై సీఎం రేవంత్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందన్నారు. రవీంద్రభారతిలో జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలను ఆయన బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూల్స్తో ఎందుకు ప్రభుత్వ బడులు పోటీ పడలేకపోతున్నాయని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులకు రూ.40 వేలు ఖర్చు చేస్తున్నామని రేవంత్​రెడ్డి తెలిపారు.

CM Revanth | వారి ఉద్యోగాలు తీయడంతోనే..

నిరుద్యోగ సమస్యతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచిందని రేవంత్​రెడ్డి అన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీంతో యువత 12 ఏళ్ల వయసు వృథా అయిందన్నారు. కేసీఆర్​, కేటీఆర్​ ఉద్యోగాలు తీసేయడంతో ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయన్నారు. వారు స్ట్రేచర్​ ఉందని విర్రవీగడంతోనే ప్రజలు వారిని స్ట్రెచర్​ మీదకు పంపారన్నారు. ఇంకా అలాగే చేస్తే తర్వాత మార్చురీకి పోతారని వ్యాఖ్యలు చేశారు.

Advertisement