అక్షరటుడే, బాన్సువాడ: నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో బుధవారం రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు ఎల్ఆర్ఎస్ సర్వే నిర్వహించారు. లేఅవుట్ లేని భూములను పరిశీలించారు. దరఖాస్తుదారుల ప్లాట్లను సర్వే చేసి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సూర్యకాంత్, ఆర్ఐ అంజు, ఇరిగేషన్ ఏఈ షరీఫ్, పంచాయతీ కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.