అక్షరటుడే, నిర్మల్ : రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు వందశాతం కట్టుబడి ఉన్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మాటేగాంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ లోపు రుణమాఫీ అమలు చేస్తామని, త్వరలోనే రైతు భరోసా ఒక వాయిదాను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు, ప్రతి కుటుంబానికి స్మార్ట్ కార్డు అందిస్తామన్నారు. మహారాష్ట్రకు సరిహద్దున ఉన్న ముధోల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు.