అక్షరటుడే, బోధన్ : sand Mining | ఇసుక అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన ఓ రెవెన్యూ అధికారి ఏకంగా వారికి అండదండలు అందించాడు. ఉన్నతాధికారుల నిఘా లేదని వారికి లీకులిస్తూ.. అక్రమ రవాణా సాగించేలా వ్యాపారులను ప్రోత్సహించాడు. కాగా.. వారి నుంచి పెద్ద ఎత్తున మామూళ్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వాయిస్ రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చకు దారితీసింది.
బోధన్ రూరల్(Bodhan Rural) మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గంగాధర్(Gangadhar)పై మొదటి నుంచి అవినీతి ఆరోపణలున్నాయి. ఇసుక(sand) రీచ్‌ల వద్ద అక్రమార్కులకు అండదండలు అందిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఓ ఇసుక వ్యాపారితో ఆయన పలుమార్లు ఫోన్(phone)లో సంభాషణలు జరిపిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
సదరు వ్యాపారితో ఫోన్(phone)లో మాట్లాడిన ఆర్ఐ గంగాధర్(RI Gangadhar) ఫలానా వేళల్లో ఇసుక లారీలు తరలించాలని, అప్పడు ఎవరి నిఘా ఉండదని చెప్పినట్లు ఆ వాయిస్ రికార్డు ద్వారా అర్థమవుతోంది. ఇలా కొంత కాలం పాటు ఇసుక(sand) వ్యాపారులకు ఆర్ఐ అండదండలు అందించి మామూళ్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఓ వ్యాపారికి సంబంధించిన ఇసుక లారీ(sand lorry)ని సీజ్ చేయడంతో ఈ వాయిస్ రికార్డులు బయటపెట్టినట్లు తెలుస్తోంది. కాగా.. ఇదే విషయమై ఆర్ఐ గంగాధర్‌ను వివరణ కోరగా.. నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. కొందరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని.. వేబిల్లు(waybills)ల్లో తేదీలు మార్చేసి ఇసుక రవాణా చేస్తే పట్టుకున్నామని తెలిపారు.
అయితే.. ఇంత కఠినంగా ఉంటామని చెబుతున్న అధికారులు.. నిమిషాల తరబడి, పదుల సంఖ్యలో అక్రమార్కులతో ఫోన్లో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఉన్నతాధికారులు విచారణ జరిపి అసలు విషయాలు తేల్చాలి.