అక్షరటుడే, వెబ్ డెస్క్ Heart Attack : హార్ట్ ఎటాక్, (Heart Attack) హార్ట్ స్ట్రోక్ (Heart stroke) అనేది ఈ రోజుల్లో కామన్ అయింది. పది మందిలో ఇద్దరు ముగ్గురు హార్ట్ స్ట్రోక్, (Heart stroke) హార్ట్ ఎటాక్ కి గురవుతున్నారు. అందులో కొందరు పరిస్థితి విషమించి చివరకు మృత్యువాత పడుతున్నారు. గుండెపోటు ఎప్పుడు వస్తుంది..? ఎలా వస్తుంది..? ఏ వయసు వాళ్లకు వస్తుంది..? అనే విషయాన్ని ఈరోజుల్లో చెప్పడం కష్టం. కానీ, గుండెపోటును రాకుండా కొంత మేరకు మాత్రం నివారించవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
డైట్ ఎంతలా మెయిన్టెన్ చేసినా, క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా కూడా ఈరోజుల్లో గుండెజబ్బులు వస్తున్నాయి. అందుకే (Heart Attack) గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని రాకుండా నివారించడం కోసం ఒక మెడిసిన్ ను సైంటిస్టులు కనిపెట్టారు. యూఎస్ కి చెందిన ఎలి లిల్లీ అనే సంస్థ ఈ మెడిసిన్ ను డెవలప్ చేసింది. లెపొడిజిరాన్ అనే మెడిసిన్ ఇది. ఈ మెడిసిన్ ను సంవత్సరానికి ఒక్కసారి వాడితే చాలు. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ రాకుండా నివారించవచ్చు. దాదాపుగా 94 శాతం వరకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించారు.
Heart Attack : త్వరలోనే మార్కెట్ లోకి రానున్న మెడిసిన్
ఈ మెడిసిన్ త్వరలోనే యూఎస్ మార్కెట్లోకి అయితే రానుంది. సైంటిస్టుల పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే.. ఈ మెడిసిన్ ఒక్కసారి వేసుకుంటే ఆరు నెలల వరకు పని చేస్తుంది. దాని వల్ల మరో ఆరు నెలల వరకు గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు. ఈ మెడిసిన్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకపోవడం వల్ల త్వరలోనే ఈ మెడిసిన్ ను యూఎస్ మార్కెట్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత ప్రపంచ మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.