అక్షర టుడే, వెబ్ డెస్క్ IPL 2025 : ఐపీఎల్‌లో (IPL 2025) భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో అయిన అద్భుత ప్రదర్శన కనబరుస్తాడేమో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, పంత్ (Rishabh Pant) మాత్రం నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) (Punjab Kings)పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో మరోసారి విఫలమయ్యాడు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తన కొత్త ఫ్రాంచైజీ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు.5 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) బిగించిన ఉచ్చును పసిగట్టలేక పంత్ మూల్యం చెల్లించుకున్నాడు.
IPL 2025 : పంత్ వైఫల్యం..
గ్లేన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) బౌలింగ్‌లో పంత్ (Rishabh Pant) లెగ్ సైడ్ షాట్ ఆడగా.. ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న చాహల్ చేతిలోకి బంతి నేరుగా వెళ్లింది. ప్లాన్ ప్రకారమే ఫీల్డ్ సెట్ చేసి మరి పంత్‌ని బోల్తా కొట్టించినట్టు అర్ధమవుతుంది. అయితే జట్టుకి అండగా నిలబడాల్సిన పంత్ ఇలా ప్రతి మ్యాచ్‌లో నిరాశపరుస్తుండడం అభిమానులని , లక్నో (Lucknow) మేనేజ్‌మెంట్‌ని ఇబ్బంది పెడుతుంది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడిన పంత్ చేసింది 17 పరుగులే. ఢిల్లీతో తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన పంత్.. తర్వాత హైదరాబాద్‌తో పోరులో 15 పరుగులకే ఔట్ అయ్యాడు. తాజాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో 2 రన్స్‌కే వెనుదిరిగాడు.
ఐపీఎల్ (IPL) వేలంలో ఎవరూ ఊహించని ధర దక్కించుకున్న ఆటగాడి నుంచి ఆ సీజన్‌లో ‘పైసా వసూల్’ ప్రదర్శనను ఆశించడం అత్యాశే! 2008లో మొదలైన ఈ లీగ్ చరిత్రలో ఇప్పటిదాకా నిర్వహించిన వేలం ప్రక్రియలలో ‘మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ప్లేయర్’గా నిలిచిన ఆటగాళ్లు ఎవరు కూడా మంచి ప్రదర్శన కనబరిచిన దాఖలాలు లేవు. . ఈ సీజన్ కోసం గత డిసెంబర్‌లో నిర్వహించిన వేలం ప్రక్రియలో రికార్డు స్థాయిలో రూ. 27 కోట్ల జాక్‌పాట్ కొట్టిన రిషభ్ పంత్ (Rishabh Pant) విసిగిస్తున్నాడనే చెప్పాలి. గతంలో కేఎల్ రాహుల్ (KL Rahul) ఆటతీరు బాగోలేదని లక్నో యజమాని తీవ్ర ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు పంత్‌పై కూడా అంతే కోపం చూపిస్తాడా అనేది చూడాల్సి ఉంది.