అక్షరటుడే, ఎల్లారెడ్డి: చిన్నపాటి నిర్లక్ష్యం బాలుడి ప్రాణాన్ని బలిగొంది.. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట మండలం బోనాల్‌లో చెరువు ముందటి తండాలో నివసించే రామావత్‌ భాస్కర్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. మంగళవారం భాస్కర్‌ తన ఇంటి సమీపంలో దిగుడు ఉన్న ప్రదేశంలో ట్రాక్టర్‌ను గేర్ వేసి నిలిపి కామారెడ్డికి వెళ్లారు. ఆయన కుమారుడు రిషికేష్‌ (6) ఆడుకుంటూ ట్రాక్టర్‌ పైకి ఎక్కి గేర్లను తీయడంతో ట్రాక్టర్‌ ముందుకు వెళ్లి గుంతలో పడిపోయింది. దీంతో ట్రాక్టర్‌ పై ఉన్న రిషికేష్‌పై ట్రాలీ పడడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.