Summer | పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

Summer | పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
Summer | పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Summer | రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు (Temparature) పెరుగుతున్నాయి. ఉదయం పది గంటలకే ఎండలు మండుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.

Advertisement

ఫలితంగా మధ్యాహ్నం సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. శనివారం ఆసిఫాబాద్​లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 42.4°డిగ్రీల టెంపరేచర్​ నమోదు కావడం గమనార్హం. మార్చి మధ్యలోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే.. ఏప్రిల్​, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా మరో ఐదురోజుల పాటు వేడి గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.

Summer | పెరిగిన విద్యుత్​ వినియోగం

ఎండలు మండుతుండటంతో ప్రజలు ఇళ్లలోనే ఉన్నా ఉక్కపోత(Heat)తో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఏసీలు(AC), కూలర్ల(Cooler) వినియోగం పెరిగి, విద్యుత్​ డిమాండ్​(Electricity) పెరిగింది. మరోవైపు వరి సాగుకు కూడా ప్రస్తుతం నీరు అధికంగా అవసరం కావడంతో రైతులు నిత్యం మోటార్లు నడిపిస్తున్నారు. ఫలితంగా విద్యుత్​ డిమాండ్​ రికార్డు స్థాయిలో నమోదు అవుతుంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా గురువారం 16,918 మెగావాట్ల డిమాండ్​ నమోదు అయింది. కొద్దిరోజులుగా నిత్యం 16 వేల మెగావాట్లకు పైనే విద్యుత్​ డిమాండ్​ ఉంటోందని అధికారులు చెబుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Telangana | తెలంగాణకు పదేళ్లుగా పట్టిన చంద్ర గ్రహణం వదిలింది : సీఎం రేవంత్​