kamareddy | డివైడర్ ను ఢీకొని ఒకరి మృతి

kamareddy | డివైడర్ ను ఢీకొని ఒకరి మృతి
kamareddy| డివైడర్ ను ఢీకొని ఒకరి మృతి
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: kamareddy : ద్విచక్ర వాహనంపై వెళ్తూ డివైడర్ ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన వడ్ల సుదర్శన్(56) సదాశివనగర్ గ్రామంలో పని ఉందని బుధవారం వెళ్ళారు. గురువారం సాయంత్రం పనులు ముగించుకుని గ్రామానికి ద్విచక్ర వాహనంపై వస్తుండగా అడ్లూర్ ఎల్లారెడ్డి జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో స్పృహ కోల్పోయిన సుదర్శన్ ను వాహనదారులు జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Hyderabad - Srisailam Highway : హైదరాబాద్ – శ్రీశైలం నేషనల్ హైవేపై కొత్త అప్ డేట్.. అండర్ గ్రౌండ్ రోడ్డు రాబోతోందా?