అక్షరటుడే, వెబ్ డెస్క్ : national highway : నిజాంసాగర్ మండలంలోని మంగుళూరు గేటు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు.
ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి గ్రామం నుంచి ఇటుక లోడుతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ మరమ్మతులకు గురికావడంతో మంగుళూరు గేటు సమీపంలో జాతీయ రహదారిపై నిలిపివేశారు. సంగారెడ్డి జిల్లాలోని సిర్గాపూర్ గ్రామానికి చెందిన సాయిలు(45) ద్విచక్ర వాహనంపై మహమ్మద్ నగర్ నుంచి పిట్లం వైపునకు వెళ్తుండగా.. రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టరును ఢీకొన్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.