అక్షరటుడే, ఆర్మూర్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం సురక్షితమని ఎంవీఐ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం ఆర్మూర్ బస్ డిపోలో జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు ఉత్తమ డ్రైవర్లు నారాయణ, ముత్తన్న, శ్రీనివాస్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గంగాధర్, డిపో మేనేజర్ ఆంజనేయులు, అసిస్టెంట్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎన్‌వీవీ రెడ్డి, ఎస్‌డీఐ హైమద్ పాల్గొన్నారు.