ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

0

అక్షరటుడే, ఇందూరు: రోడ్డు ప్రమాదాల బారినపడి భవిష్యత్తును కోల్పోకుండా ఉండాలంటే ట్రాఫిక్ నిబంధలను పాటించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. మంగళవారం జీజీహెచ్ లో నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో మాట్లాడారు. వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం సీపీ కల్మేశ్వర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ జయరాం, ప్రొబేషనరీ ఐపీఎస్ చైతన్య, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.