అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nizamabad Town | నగరంలోని టూ టౌన్ Two Town పరిధిలో గల అహ్మద్‌పురా కాలనీలో Ahmedpura Colony రోడ్డు పక్కన తగాదాకు దిగిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆదివారం రాత్రి కాలనీలో రోడ్డు పక్కన పలువురి మధ్య మాటామాటా పెరిగి తగాదా జరిగింది.
దీంతో అజీజ్ అహ్మద్ ఖాన్ ఫిర్యాదు మేరకు అబ్దుల్ సాజిద్, అబ్దుల్ బాసిత్, మొహమ్మద్ ఆసిఫ్ అలీపై Mohammad Asif Ali కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అలాగే, అబ్దుల్ సాజిద్ ఫిర్యాదు మేరకు అజీజ్ అహ్మద్ ఖాన్, జాహెద్ అహ్మద్ ఖాన్, జాకీ అహ్మద్ ఖాన్, సమీర్ అహ్మద్ ఖాన్, మొహమ్మద్ రహీంపై సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.