అక్షర టుడే, వెబ్ డెస్క్ Robinhood Collections : నితిన్, (Nithin) వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబినేషన్ లో వచ్చిన రాబిన్ హుడ్ సినిమా (Robin Hood movie) శుక్రవారం రిలీజైంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించారు. ఈ సినిమాలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించారు. రాబిన్ హుడ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఐతే సినిమా ఫస్ట్ టాక్ నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది.
ఛలో, భీష్మ సినిమాలతో సక్సెస్ అందుకున్న వెంకీ కుడుముల (Venky Kudumula) రాబిన్ హుడ్ (Robin Hood movie) తో హ్యాట్రిక్ హిట్ కొడతాడని అనుకున్నారు. కానీ సినిమా విషయంలో లెక్కలు తారుమారయ్యాయి. రాబిన్ హుడ్ సినిమా (Robinhood Collections) తొలి రోజు 4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే రెండున్నర కోట్ల షేర్ మత్రమే రాబట్టినట్టు తెలుస్తుంది. (Robin Hood movie) రాబిన్ హుడ్ సినిమాను నిర్మాతలు భారీ బడ్జెట్ లో తెరకెక్కించారు. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగనే జరిగింది.
Robinhood Collections : వీకెండ్ ఏమైనా కలిసి వస్తుందా లేదా
రాబిన్ హుడ్ సినిమా (Robin Hood movie) 35 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఐతే సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి తొలిరోజు మాత్రం 4 కోట్లకు అటు ఇటుగా మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది. మరి వీకెండ్ ఏమైనా కలిసి వస్తుందా లేదా ఇదే కొనసాగుతుందా అన్నది చూడలి. ఐతే రాబిన్ హుడ్ ఈ రేంజ్ కలెక్షన్స్ రాబడితే మాత్రం కచ్చితంగా భారీ లాసులు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి., నితిన్ కి బ్యాడ్ లక్ ఇంకా కొనసాగుతున్నట్టు ఉంది.
(Robin Hood movie) రాబిన్ హుడ్ మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. నితిన్ (Nithin) శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ కూడా ఫ్లాప్ కాగా రాబిన్ హుడ్ మీద ఎన్నో అంచనాలు పెట్టుకోగా అది తుస్సైంది. ఐతే నితిన్ (Nithin) ఈ సినిమా తర్వాత తమ్ముడు, ఎల్లమ్మ సినిమాలతో రాబోతున్నాడు.