
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rohit sharma : ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ అరుదైన రికార్డులు సాధిస్తున్నారు. గొప్ప బ్యాటర్స్‌లో ఒకడైన రోహిత్ శర్మ 2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ప్రతి ఇన్నింగ్స్‌లో కూడా అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబరుస్తూ కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు.
2022లో విరాట్ కోహ్లీ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత జట్టును అన్ని ఫార్మాట్లలోనూ ముందుకు నడిపించాడు. తాజాగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చేరడంతో రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది. అన్ని ఐసీసీ టోర్నీలలో జట్టుని ఫైనల్ వరకు తీసుకెళ్లిన కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో ప్రపంచ రికార్డ్ నమోదైంది.
rohit sharma : రోహిత్ నయా రికార్డ్..
2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్, 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి భారత్ చేరింది. తమ జట్టుని నాలుగు ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌కి తీసుకెళ్లిన ఘనత రోహిత్ కి మాత్రమే దక్కింది. 2024 టీ 20 ప్రపంచ కప్ రోహిత్ కెప్టెన్సీలోనే భారత్ కి దక్కింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ వరుసగా మూడోసారి తుది పోరుకి అర్హత సాధించడం విశేషం. 2013, 2017, 2025 సంవత్సరాలలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కి చేరింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్స్‌లో భారత్ ఆస్ట్రేలియాని ఓడించి ఫైనల్‌కి చేరింది.
తాజా మ్యాచ్‌లో రోహిత్ ఖాతాలో పలు రికార్డులు చేరాయి. 37 ఏళ్ల రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో కలిపి 497 మ్యాచ్‌ల్లో 42.14 సగటుతో 19,596 పరుగులు చేయగా.. ఇందులో 49 సెంచరీలు, 107 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. హిట్ మ్యాన్ సిక్సర్లు అవలీలగా బాదగలడనే సంగతి మనకు తెలిసిందే. ప్రతి ఫార్మాట్‌లో సిక్సర్లు అవలీలగా బాదేస్తుంటాడు రోహిత్. ఇప్పటివరకు 272 వన్డే మ్యాచ్‌లు ఆడి 341 సిక్సర్లు కొట్టిన రోహిత్ మరో రికార్డ్ కి చేరువలో ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా 350 వన్డే సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచేందుకు 9 సిక్సర్స్ కొట్టాల్సి ఉంది.