అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: మాధవనగర్‌ వద్ద రైల్వే ట్రాక్‌ను ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీఎఫ్‌ పోలీసులు శుక్రవారం ఉదయం పరిశీలించారు. గేటు వద్ద గురువారం ఓ యువకుడు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. గేట్‌మన్‌పై దాడికి యత్నించడంతో పాటు ట్రాక్‌పై రాళ్లు పెట్టిన అంశాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం విచారణ చేపట్టారు.