అక్షరటుడే, నిజామాబాద్: ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి మాల్ కు మరో సారి నోటీసులు జారీ కావడం కలకలం రేపింది. రూ. 45కోట్ల బకాయిలు చెల్లించాలని ఆర్మూర్‌ జీవన్‌రెడ్డి మాల్‌కు, షూరిటీ ఇచ్చిన రైతులకు నోటీసులు జారీ అయ్యాయి. విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌, రజిత రెడ్డి, వెంకట రాజన్నతో పాటు షూరిటీ ఇచ్చిన రైతులు కాటిపల్లి గంగారెడ్డి, ఎల్ల నరేందర్‌, నక్క లక్ష్మణ్‌లకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ నోటీసులిచ్చింది. రూ. 45.46 కోట్ల బకాయిలు చెల్లించాలని.. లేదంటే ఆస్తులను జప్తు చేస్తామని నోటీసుల్లో పేర్కొంది. జీవన్ రెడ్డి మాల్ కు మరోసారి నోటీసులు జారీ కావడం ప్రస్తుతం జిల్లాలో చర్చకు దారితీసింది.