అక్షరటుడే, భిక్కనూరు: సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటుతోంది మహిళలేనని ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందూర్‌ విభాగ్‌ ప్రచారక్‌ వెంకట శివకుమార్‌ పేర్కొన్నారు. బుధవారం భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్‌ క్యాంపస్‌లో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా స్త్రీశక్తి దివస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వందల ఏళ్ల క్రితమే ఝాన్సీ లక్ష్మీబాయిలాంటి ఎందరో త్యాగధనులు దేశం కోసం పోరాడారన్నారు. వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. దేశచర్రిత్ర కొందరి వల్ల మరుగున పడిందని, దానిని వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యువత దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములై ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ లలిత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు ప్రతిజ్ఞ, హరిత, కవిత, మోమన్‌బీబు, నారాయణ, వీరభద్రం, వైశాలి, యాలాద్రి, సరిత నర్సయ్య కనకన్న, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధులు వంగ రాహుల్, చెన్నప్పగారి మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.