మేడారం జాతరకు జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు

0

అక్షరటుడే, ఇందూరు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రద్దీ నేపథ్యంలో జిల్లా నుంచి బస్సులు కేటాయించినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం జాని రెడ్డి తెలిపారు. ఈ నెల 19వ నుంచి 25వ తేదీ వరకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి వరంగల్‌ జిల్లాకు 270 బస్సులు పంపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు రూట్లలో బస్సుల సంఖ్య తగ్గుతుందని, ప్రయాణికులు అందుబాటులో ఉన్న బస్సుల్లో తమ గమ్యానికి చేరుకోవాలని ఆర్ఎం సూచించారు.