Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. తెలంగాణలో నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీలో సమ్మె సైరన్​ మోగనుంది. ఎలక్ట్రిక్​ బస్సులను ప్రవేశ పెట్టడాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. దీంతోపాటు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కార్మిక సంఘాలు ఎండీ సజ్జనార్​కు సమ్మె నోటీస్​ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి.

Advertisement