అక్షరటుడే ఇందూరు: ప్రైవేటు ఉపాధ్యాయుల హెల్త్ కార్డు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. గురుపూజోత్సవంలో భాగంగా ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రైవేటు ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు గురువులపైనే ఆధారపడి ఉందన్నారు. జాతీయతా భావం పెంపొందించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ.. వ్యవస్థలో గురువులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. విద్యార్థులు శ్రద్ధతో చదవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీఈఓ దుర్గా ప్రసాద్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి రమేష్ రావు, ప్రతినిధులు యాదగిరిరావు, రాఘవేంద్ర రెడ్డి, స్పోక్స్ పర్సన్ జయసింహ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానంద్, కార్యదర్శి అరుణ్, మధు, నరసింహారావు, మోహన్, తదితరులు పాల్గొన్నారు.