అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో సోమవారం ఆయన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల శ్రేయస్సు కోసమే ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సతీష్ కుమార్, తహశీల్దార్ కిరణ్మయి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు మద్దుల రమేష్, బాలకిషన్, నర్సారెడ్డి, బోన్ల శ్రీధర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.