అక్షరటుడే, ఇందూరు: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి ఆదరణ పెరిగిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ బస్టాండ్ లో ప్రజా పాలన విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ప్రారంభమయ్యాక ఆర్టీసీ బస్సుల్లో పేద మహిళల ప్రయాణం 66 శాతం పెరిగిందన్నారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement