Russia | మోదీకి ర‌ష్యా ఆహ్వానం

Russia | మోదీకి ర‌ష్యా ఆహ్వానం
Russia | మోదీకి ర‌ష్యా ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Russia | ర‌ష్యాలో నిర్వ‌హించ‌నున్న వేడుక‌ల‌కు రావాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని Prime Minister Narendra Modi ఆ దేశం ఆహ్వానించింది. రెండవ ప్రపంచ యుద్ధంలో World War II జర్మనీపై Germany సోవియట్ విజయం సాధించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మే 9న మాస్కోలో విజయ దినోత్సవాలు (విక్ట‌రీ డే) నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌ల‌కు రావాల‌ని ర‌ష్యా Russia మోదీని స‌గౌర‌వంగా ఆహ్వానించింది. ద‌శాబ్దాల కాలంగా రెండు దేశాల మ‌ధ్య మైత్రి బంధం కొన‌సాగుతోంది. ఆ దేశాధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు President Vladimir Putin, మోదీకి PM modi స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే విక్ట‌రీ డే వేడుక‌ల‌కు రావాల‌ని అధికారిక ఆహ్వానం పంపిన‌ట్లు రష్యా విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి ఆండ్రీ రుడెంకో తెలిపారు.

Advertisement
Advertisement

Russia | జ‌ర్మ‌నీపై విజ‌యానికి గుర్తుగా..

రెండవ ప్రపంచ యుద్ధంలో World War II నాజీ జర్మనీపై Nazi Germany సోవియట్ యూనియ‌న్ విజ‌యం సాధించింది. రెండో ప్ర‌పంచ యుద్ధంలో 1945 మే 9న జ‌ర్మ‌నీ లొంగిపోయింది. దీనికి గుర్తుగా ఏటా మే 9న విక్ట‌రీ డే Victory Day నిర్వ‌హిస్తారు. జ‌ర్మ‌నీపై విజ‌యం సాధించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈసారి మోదీని ఆహ్వానించారు. ఈ సంవత్సరం నిర్వ‌హించిన వేడుక‌లో రష్యా అనేక ఇతర “స్నేహపూర్వక దేశాల” “friendly countries” నాయకులను కూడా ఆహ్వానించింది. అయితే, విక్ట‌రీ డే వేడుక‌ల‌కు ప్ర‌ధాని Prime Minister Modi వెళ్తారా.. లేదా? అన్న దానిపై ఇంకా స్ప‌ష్ట‌త లేదు. ప్రధాని మోదీ చివరిసారిగా గ‌తేడాది జూలై లో రష్యాలో ప‌ర్య‌టించారు. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ విస్తృత చర్చలు జరిపారు. ఆయ‌న‌ను భార‌త్‌కు రావాల‌ని ఆహ్వానించ‌గా, పుతిన్ అంగీకరించారు, అయితే ఎప్పుడు వ‌స్తార‌న్న‌ది ఇంకా ఖ‌రారు కాలేదు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Varanasi | వారణాసిలో యువతిపై 23 మంది రాక్షస క్రీడ.. స్పందించిన మోదీ