అక్షరటుడే, వెబ్ డెస్క్ : ప్రతి మహిళా టీ-సేఫ్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని సాధన స్వచ్ఛంద సంస్థ, కళాబృందం సభ్యులు సూచించారు. కామారెడ్డి డిగ్రీ కళాశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆకతాయిలతో ఇబ్బందులు వస్తే షీటీం నెంబర్ 87126 86094కు, సైబర్ నేరాలఫై ఫిర్యాదులకు 1930కు ఫోన్ చేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమంలో కళాబృందం సభ్యులు, కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, శారద పాల్గొన్నారు.