అక్షరటుడే, వెబ్డెస్క్: Hanuman Jayanthi | భాగ్యనగరంలోని వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. ఎక్కడ చూసిన కాషాయ జెండాలు పట్టుకొని హనుమాన్ భక్తులు(Hanuman devotees) రామదండులా కనిపిస్తున్నారు. హనుమాన్ జయంతి(Hanuman Jayanthi) సందర్భంగా నేడు హైదరాబాద్లో వీర హనుమాన్ విజయయాత్ర(Veera Hanuman Vijaya Yathra) ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.. గౌలిగూడ రామమందిరం నుంచి ఉదయం 11:30 గంటలకు యాత్ర ప్రారంభం కానుంది. సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ ఆయలం వరకు యాత్ర సాగనుంది. వివిధ ప్రాంతాలు, కాలనీల నుంచి కూడా భక్తులు ర్యాలీగా వచ్చి ఈ యాత్రలో కలుస్తారు. దీంతో మరికొద్దిసేపట్లో హైదరాబాద్ హనుమాన్ నామస్మరణతో మార్మోగనుంది.
Hanuman Jayanthi | 12 కి.మీ. సాగనున్న యాత్ర
హైదరాబాద్లో ఘనంగా నిర్వహిస్తున్న వీర హనుమాన్ విజయ యాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 12 కిలోమీటర్ల మేర శోభాయాత్ర(Shobha Yathra) సాగనుండగా.. 17 వేల మంది పోలీసులు బందోబస్తు(Police Bandobasth)లో పాల్గొంటున్నారు. విజయయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.