అక్షరటుడే, ఇందూరు : బాసర ట్రిపుల్ ఐటీలో నిరసన తెలిపిన ఏబీవీపీ నాయకులపై జరిగిన లాఠీఛార్జిలో సాయి కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడిని సోమవారం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. ఆయన వెంట ఏబీవీపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రెంజర్ల నరేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్, సురేందర్ రెడ్డి, ఏబీవీపీ పూర్వ నాయకులు స్వామి యాదవ్, నవీన్, పిల్లి శ్రీకాంత్ తదితరులున్నారు.