Betting | బెట్టింగ్​ యాప్​​ ప్రమోటర్లకు సజ్జనార్​ వార్నింగ్​

Betting | బెట్టింగ్​ యాప్​​ ప్రమోటర్లకు సజ్జనార్​ వార్నింగ్​
Betting | బెట్టింగ్​ యాప్​​ ప్రమోటర్లకు సజ్జనార్​ వార్నింగ్​
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Betting | బెట్టింగ్​ యాప్​ ప్రమోటర్లకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ వార్నింగ్​ ఇచ్చారు. వారు అలాంటి పనులు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. బెట్టింగ్​ యాప్​ ప్రమోటర్లపై సమగ్ర దర్యాప్తు చేయాలన్నారు. అలా చేస్తే మనీలాండరింగ్, చట్టవ్యతిరేక నేరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అప్పుడు వారిపై మరిన్ని కేసులు నమోదు చేయొచ్చని తెలిపారు.

Betting | అన్​ఫాలో చేయండి

బెట్టింగ్​ యాప్స్​ ప్రమోట్​ చేసే వారిని అన్​ఫాలో చేయాలని యువతకు సజ్జనార్​ సూచించారు. అభిమానంతో మనల్ని అనుసరించే వారిని మోసం చేయడం సరికాదని ఆయన సోషల్​ మీడియా ఇన్​ప్లూయెన్సర్లకు సూచించారు. బెట్టింగ్​ యాప్​ల నిర్మూలనకు అందరం కలిసి పోరాటం చేయాలన్నారు. బెట్టింగ్​ యాప్​లతో ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. డబ్బులు సంపాదించడానికి బెట్టింగ్​ యాప్​ ప్రమోట్​ చేయడం సరికాదన్నారు.

Betting | తల్లిదండ్రులు గమనించాలి

బెట్టింగ్​ యాప్​లకు అలవాటు పడిన వారిలో మార్పు వస్తుందని సజ్జనార్​ అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఎప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. స్మార్ట్​ఫోన్లలో కొత్తయాప్​ డౌన్​లోడ్​ చేసుకున్నా, బయట అప్పులు చేస్తున్నట్లు తెలిసినా వారికి కౌన్సెలింగ్​ ఇప్పించాలని సూచించారు. కష్టపడితేనే డబ్బులు వస్తాయనే విషయాలను పిల్లలకు వివరించాలని చెప్పారు. ఈజీ మనీకి అలవాటు పడితే జీవితాలు నాశనం అవుతాయన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  YouTuber | యూట్యూబర్‌ హర్షసాయిపై కేసు నమోదు

Betting | ఇద్దరిపై కేసు నమోదు

బెట్టింగ్​ యాప్​లను ప్రమోట్​ చేస్తున్న సోషల్​ మీడియా ఇన్​ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు అయినట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. భయ్యా సన్నీయాదవ్​పై నూతన్​కల్​లో, హర్షసాయిపై హైదరాబాద్​లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే వారికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో కనుక్కోవాలని ఆయన సూచించారు. అప్పుడే కేసు మూలాలు తెలుస్తాయన్నారు.

Advertisement