అక్షరటుడే, వెబ్‌డెస్క్:Salman Khan | ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan)ను హత్య చేస్తామని మరోసారి బెదిరింపులు వచ్చాయి. సల్మాన్‌ఖాన్‌ను ఆయన ఇంట్లోనే చంపడంతో పాటు అతని కారును బాంబులతో పేల్చేస్తామని గుర్తు తెలియని వ్యక్తి రవాణా శాఖ అధికారిక నంబర్‌కు సోమవారం వాట్సాప్ మెసేజ్ అందింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న వర్లి పోలీసులు(Worli Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు అజ్ఞాత వ్యక్తి పంపింన మెసేజ్ నంబర్ ఎవరి పేరిట ఉంది, ఎక్కడి నుంచి మెసేజ్ వచ్చిందన్న వివరాలు ఆరా తీస్తున్నారు. మరోవైపు ముంబైలోని సల్మాన్ నివాసం వద్ద భధ్రతను కట్టుదిట్టం చేశారు.
Salman Khan | తరచూ బెదిరింపులు..
సల్మాన్‌ఖాన్ చాలా కాలంగా బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు. గ్యాంగ్ స్టార్ లారెన్స్ బిష్ణోయ్(Gangstar Lawrence Bishnoi) గ్యాంగ్ అతడిపై పలుమార్లు రెక్కీ నిర్వహించడంతో హత్యాయత్నాలకు పాల్పడింది. 1990లో హమ్ సాత్సా త్ హై సినిమా షూటింగ్ సందర్భంగా కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌తో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. అయితే, కృష్ణజింక(Black deer)లను ఆరాధ్యంగా భావించే జాతికి చెందిన లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్‌ను అంతమొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. 2022లో జరిగిన పంజాబీ గాయకుడు సిద్ధూ మూసే వాలా హత్య కేసులో నిందితుల్లో ఒకరైన లారెన్స్ బిష్ణోయ్.. జైలులో ఉన్నప్పటికీ తన గ్యాంగ్ ద్వారా సల్మాన్ హత్యకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.
Salman Khan | పలుమార్లు రెక్కీ..
సల్మాన్‌పై పగబట్టిన లారెన్స్ పలుమార్లు రెక్కీ(Reiki) నిర్వహించాడు. గతేడాది ముంబైలోని బాంద్రా ప్రాంతంలో గల సల్మాన్ నివాసంపైకి కాల్పులు జరిగాయి. మోటార్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఇంటిపైకి కాల్పులు జరిపి పరారయ్యారు. సల్మాన్‌ను బెదిరించడానికే బిష్ణోయ్ గ్యాంగ్(Bishnoi Gang) కాల్పులు జరిపినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు, గత అక్టోబర్‌లో సల్మాన్ ఖాన్ సన్నిహితుడు, ఎన్‌సీపీ (అజిత్ పవార్ వర్గం) నాయకుడు బాబా సిద్ధిక్(Baba Siddique)ను ముంబైలోని అతని ఇంటికి సమీపంలో దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య తామే చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఆయా ఘటనల అనంతరం సల్మాన్ ఖాన్ భద్రతను కట్టుదిట్టం చేశారు. అతని నివాసంలోని బాల్కనీలో కూడా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు(Bulletproof glasses) అమర్చారు. గత నెలలో తన సినిమా సికందర్ విడుదల సందర్భంగా సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాను బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు. భారీ భద్రతతో తిరగడం కొన్నిసార్లు కష్టమని పేర్కొన్న ఆయన.. తన భద్రతను దేవుడికేని వదిలేశానని చెప్పాడు.