Salman Khan : రష్మిక ఉన్నా కూడా కాజల్ ని తీసుకున్నారు.. సల్మాన్ సికందర్ పెద్ద ప్లానింగే బాసు..!

Salman Khan : రష్మిక ఉన్నా కూడా కాజల్ ని తీసుకున్నారు.. సల్మాన్ సికందర్ పెద్ద ప్లానింగే బాసు..!
Salman Khan : రష్మిక ఉన్నా కూడా కాజల్ ని తీసుకున్నారు.. సల్మాన్ సికందర్ పెద్ద ప్లానింగే బాసు..!
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Salman Khan : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు Salman Khan సల్మాన్ ఖాన్ తో Sikander movie సికందర్ సినిమాలో నటిస్తుంది. ఈమధ్యనే ఛావా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు మరోసారి సల్మాన్ సినిమాతో సత్తా చాటాలని చూస్తుంది. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో Rashmika రష్మిక తో పాటు ఒక సాంగ్ లో కాజల్ కూడా నటిస్తుందని తెలుస్తుంది.

లేటెస్ట్ గా సల్మాన్ సినిమా షూటింగ్ స్పాట్ లో కాజల్ ని చూసి ఆడియన్స్ షాక్ అయ్యారు. రష్మిక ఒక్కతే సరిపోదా ఏంటి మళ్లీ Kajal కాజల్ ని ఎందుకు తీసుకొచ్చారు అంటే సినిమాలో కాజల్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని ఆమెను తీసుకున్నట్టు తెలుస్తుంది. అదీగక Kajal Agarwal కాజల్ అగర్వాల్ మురుగదాస్ తో అంతకుముందు సినిమాలు చేసింది. సో ఆ సెంటిమెంట్ వల్ల కూడా ఆమెను తీసుకునే ఛాన్స్ ఉంది.

Salman Khan : ల్మాన్ సికందర్ లో రష్మిక తో పాటు కాజల్..

సల్మాన్ ఖాన్ సికందర్ సినిమా నుంచి లేటెస్ట్ గా ఒక సాంగ్ రిలీజ్ కాగా అది ఆడియన్స్ ని అలరిస్తుంది. ఐతే సల్మాన్ సికందర్ లో రష్మిక తో పాటు కాజల్ కూడా ఉందని తెలిసి ఆడియన్స్ ఖుషి అవుతున్నారు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా Kajal Agarwal కాజల్ అగర్వాల్ హంగామా తెలిసిందే. ఈమధ్య Rashmika రష్మిక ఎలాంటి సినిమా తీసినా సరే సూపర్ హిట్ అవుతుంది. ఈ క్రమంలో తను చేస్తున్న Sikander సికందర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Rashmika | దేవరకొండ హీరోకి రష్మిక బర్త్ డే విసెష్.. ఎన్నాళ్లు ఈ దాగుడుమూతలు అమ్మడు..!

ఇక మరోపక్క సల్మాన్ ఖాన్ Salman Khan కొన్నాళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. తప్పకుండా సికందర్ తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. మరి సికందర్ తో Rashmika రష్మిక లక్ ఫేవర్ సల్మాన్ ఖాతాలో హిట్ పడేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి. సికందర్ తర్వాత సల్మాన్ ఖాన్ అసలైతే అట్లీతో సినిమా చేయాల్సి ఉన్నా ఆ సినిమా ఎందుకో క్యాన్సిల్ అయ్యింది. అట్లీ తన నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో లాక్ చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement