అక్షరటుడే, ఇందూరు: సమ్మెను ఎవరో వెనక ఉండి చేయిస్తున్నారని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించడం తగదని సమగ్ర శిక్ష అభియాన్ జిల్లా అధ్యక్షుడు రాజు అన్నారు. సమ్మెలో భాగంగా గురువారం నగరంలోని రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమ్మె స్వతంత్రంగా కొనసాగుతుందని, అన్ని ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు సంఘీభావం తెలుపుతున్నాయన్నారు. సమ్మెకు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు సుమన్, నాయకులు మద్దతు పలికారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి భూపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్, మహిళా అధ్యక్షురాలు గంగామణి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
Advertisement
Advertisement