Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్‌: కస్తూర్బా పాఠశాలల్లో స్పెషల్‌ ఆఫీసర్ల నియామకాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సమగ్ర శిక్షా ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ మేరకు నిజాంసాగర్ లోని కేజీబీవీలో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌ కుమార్‌ మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులందరూ 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు. టీ తాగినంత సేపట్లో మా సమస్యను పరిష్కరిస్తామన్న సీఎం రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులను విద్యాశాఖలో తక్షణమే విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నిజాంసాగర్‌, మహమ్మద్‌నగర్‌ ఎంఈవోలు తిరుపతిరెడ్డి, అమర్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement