Samantha | నిర్మాతగా సమంత ఫస్ట్ సినిమా టైటిల్ వచ్చేసిందోచ్.. ఏమన్నా టైటిలా బాసు అనిపించేలా..!
Samantha | నిర్మాతగా సమంత ఫస్ట్ సినిమా టైటిల్ వచ్చేసిందోచ్.. ఏమన్నా టైటిలా బాసు అనిపించేలా..!
Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: Samantha | సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా మారి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఓ పక్క తన నటనతో ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన సమంత ఇక మీదట తన నిర్మాణ సారధ్యంలో కూడా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో ట్రాలాలా అనే ప్రొడక్షన్ ని స్థాపించి సినిమాలు చేస్తుంది సమంత. మొదటి సినిమాగా సినిమాబండి ఫేం ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో సినిమా లాక్ చేసింది.

ఈ సినిమాలో మల్గి రెడ్డి. శ్రియా కొంఠం, షాలిని కొండెపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి నటిస్తున్నారు. ఐతే ఈ సినిమాకు టైటిల్ గా శుభం అని లాక్ చేశారు. అదేంటి సినిమా పూర్తయ్యాక పడాల్సిన శుభం కార్డ్ టైటిల్ గా సినిమానా అని ఆశ్చర్యపోతున్నారు ఆడియన్స్. నిజమే సమంత చేస్తున్న తొలి సినిమాకు శుభం అనే టైటిల్ నే పెట్టారు.

Samantha : తొలి అడుగులోనే కొత్త కాన్సెప్ట్ తో..

నిర్మాతగా తన తొలి అడుగులోనే కొత్త కాన్సెప్ట్ తో వస్తుంది సమంత. ముఖ్యంగా సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల మీద ఉన్న నమ్మకంతో ప్రొడక్షన్ సైడ్ తను ఉన్నా మొత్తం బాధ్యత అతని మీదే వేసినట్టు తెలుస్తుంది. శుభం సినిమా పూర్తి కాగా త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తుంది. కామెడీతో పాటు థ్రిల్లర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఈ సినిమానే తన తొలి ప్రొడక్షన్ సినిమాగా ఎందుకు ఎంచుకున్నానో తర్వాత తెలుస్తుందని అన్నారు సమంత.

ఇది కూడా చ‌ద‌వండి :  Anasuya : చీరలో రంగమ్మత్త.. చూపులతోనే హృదయాలను కొల్లగొట్టేసేలా..!

మొత్తానికి సమంత నిర్మాతగా తొలి సినిమా శుభం రాబోతుంది. ఐతే తను నటించిన సిటాడెల్ సీరీస్ సూపర్ సక్సెస్ అవ్వడంతో సమంత వరుసగా అక్కడే వెబ్ సీరీస్ లు చేయాలని ఫిక్స్ అయ్యింది. అంతేకాదు తన ట్రాలాలా బ్యానర్లో సమంత నటిస్తూ ప్రకటించిన మా ఇంటి బంగారం సినిమా ఎంతవరకు వచ్చిందో తెలియాల్సి ఉంది. ఆ సినిమా కన్నా ముందు సమంత శుభం సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Advertisement