అక్షరటుడే, వెబ్‌డెస్క్: Samantha | స్టార్ హీరోయిన్ సమంతకు ఏమైంది..? మళ్లీ ఆమె హాస్పిటల్లో సెలైన్ ఎక్కించుకుంటూ ఎందుకు ఉంది. సమంత విషయంలో అసలేం జరుగుతుంది అన్నది క్లారిటీ లేదు. సమంత లేటెస్ట్గా తన ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. దానిలో ఆమె సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటో కూడా ఉంది. అది చూసిన సమంత ఫ్యాన్స్ సమంతకు తన వ్యాధి ఇంకా తగ్గలేదా ఆమెకు ఏమైంది అంటూ కామెంట్స్(comments) చేస్తున్నారు.
సమంత ఈమధ్య తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆమెకు మయోసైటిస్ వ్యాధి రాగా దాదాపు రెండు మూడేళ్లు దానివల్ల చాలా సఫర్ అయ్యింది. అంతేకాదు సినిమాలను కూడా ఆపేసింది సమంత. ఐతే అమ్మడు ఈమధ్య తిరిగి హెల్దీగా మారినట్టు కొన్ని ఫొటోలు పెట్టింది. కానీ తాజా ఫొటోలు చూస్తుంటే అదంతా నిజం కాదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Samantha : రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే..
సమంత లేటెస్ట్గా సెలైన్‌తో ఉన్న ఫోటో పెట్టేసరికి ఆమెకు మళ్లీ ఏమైంది అని అనుకుంటున్నారు. ఐతే సమంత(Samantha) మాత్రం తన రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే తను సెలైన్ ఎక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఆమె పెట్టిన ఆ ఫోటో సమంత ఫ్యాన్స్‌ను కంగారు పడేలా చేయగా సమంత మాత్రం దానికి క్లారిటీ ఇవ్వలేదు.
సమంత(Samantha) సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటోకి రికవరీ అని పెట్టింది. అంటే ఆమె మయోసైటిస్ ఇంకా తగ్గలేదా ఆమె దేని నుంచి రికవరీ అవుతుంది అన్నది క్లారిటీ లేదు. ఇక లేటెస్ట్గా సమంత తొలి సినిమా అదే నిర్మాతగా తొలి సినిమాకు శుభం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా విషయంలో సమంత ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. సమంత బాలీవుడ్లో సిటాడెల్ సిరీస్ చేసింది. ఆ తర్వాత అమ్మడు మరో సీరీస్‌కు సైన్ చేసినట్టు సమాచారం. ఐతే సమంత మాత్రం తెలుగు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించట్లేదు. ఇక్కడ ఆఫర్లు వస్తున్నా రిజెక్ట్ చేస్తున్నట్టు టాక్.