Samsung | ఆరేళ్ల అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ కొత్త ఫోన్‌.. ఏ మోడల్​ అంటే..

Samsung | ఆరేళ్ల అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ కొత్త ఫోన్‌.. ఏ మోడల్​ అంటే..
Samsung | ఆరేళ్ల అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ కొత్త ఫోన్‌.. ఏ మోడల్​ అంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Samsung | దక్షిణ కొరియా(SOUTH KOREA)కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కంపెనీ శాంసంగ్‌.. తన వినియోగదారులకోసం గెలాక్సీ(GALAXY) సిరీస్‌లో మరో మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆటో ట్రిమ్‌, బెస్ట్‌ ఫేస్‌, ఏఐ సెలెక్ట్‌, రీడ్‌ అలౌడ్‌ వంటి ఏఐ ఫీచర్లతో లాంచ్‌ చేసిన గెలాక్సీ ఏ56 మోడల్‌కు ఆరేళ్లపాటు సాఫ్ట్‌వేర్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ అందించనున్నట్లు ప్రకటించింది. మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో తీసుకువచ్చిన ఈ ఫోన్‌ ఫీచర్లేమిటో చూసేద్దామా..

Advertisement
Advertisement

స్పెసిఫికేషన్స్:

  1. Display : 6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ, అమోలెడ్‌ డిస్‌ప్లే. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7+ ప్రొటెక్షన్‌.
  2. Resolution: 2340×1080 పిక్సెల్‌
  3. Refresh rate : 120 Hz
  4. Operating System : ఆండ్రాయిడ్‌ 15.
  5. Processor: శాంసంగ్‌ Exynos 1580, ఆక్టా కోర్‌
  6. Battery : 5000 mAh సామర్థ్యం, 45w ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌.
  7. Camera : రేర్‌ కెమెరా 50 MP + 12 MP + 5 MP, సెల్ఫీ కెమెరా 12 MP.
  8. Colors: గ్రాఫైట్‌, లైట్‌ గ్రే, ఆలివ్‌.
ఇది కూడా చ‌ద‌వండి :  Credit cards | క్రెడిట్​ కార్డు ద్వారా తగ్గిపోయిన చెల్లింపులు.. కారణమేమిటంటే..!

ధరల శ్రేణి

  • 8 జీబీ +128 జీబీ కెపాసిటీ హ్యాండ్‌సెట్‌ ధర రూ. 41,999.
  • 8 జీబీ +256 జీబీ కెపాసిటీ హ్యాండ్‌సెట్‌ ధర రూ. 44,999.
  • 12 జీబీ +256 జీబీ కెపాసిటీ హ్యాండ్‌సెట్‌ ధర రూ. 47,999.

Offers: శాంసంగ్‌ గెలాక్సీ A 56 మోడల్‌ Samsung Galaxy A56 model ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లలో అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులతో credit cards ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి రూ. 3 వేల వరకు తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. యాక్సిక్‌ ఫ్లిప్‌కార్ట్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేసేవారికి రూ. 2,240 తక్షణ డిస్కౌంట్‌తోపాటు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ కూడా వర్తిస్తుంది.

Advertisement