Sand Bazaar | అందుబాటులోకి సాండ్​ బజార్​.. ఎక్కడంటే..

Sand Bazaar | అందుబాటులోకి సాండ్​ బజార్​.. ఎక్కడంటే..
Sand Bazaar | అందుబాటులోకి సాండ్​ బజార్​.. ఎక్కడంటే..
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: Sand Bazaar : సామాన్యులకు అందుబాటు ధరల్లో ఇసుక అందించడమే లక్ష్యంగా మేడ్చల్ జిల్లా బౌరంపేట్ లో TGMDC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ అనిల్​ ఈరవత్రి ప్రారంభించారు. ఇక్కడ సర్కారు నిర్ణయించిన ధరకు ఏడాది పొడవునా ఇసుక లభించనుంది. దీనికి సంబంధించిన వివరాలను అనిల్​ ఈరవత్రి వెల్లడించారు.

Sand Bazaar | అందుబాటులోకి సాండ్​ బజార్​.. ఎక్కడంటే..
Sand Bazaar | అందుబాటులోకి సాండ్​ బజార్​.. ఎక్కడంటే..

రూ.1600 కు ఫైన్ సాండ్​, రూ.1800 కు కోర్ సాండ్​ విక్రయిస్తున్నారు. నేరుగా రీచ్ ల నుంచి కూడా వినియోగదారులు ఇసుకను కొనుగోలు చేసుకోవచ్చు. ఉదాహరణకు కాళేశ్వరం రీచ్ నుంచి ఇసుక బుక్ చేసుకుంటే రూ.400 TGMDCకి, కిలోమీటరుకు రూ.3.75 పైసలు రవాణా ఛార్జీలుగా కడితే ఇసుక సరఫరా చేస్తారు.

Sand Bazaar | అందుబాటులోకి సాండ్​ బజార్​.. ఎక్కడంటే..
Sand Bazaar | అందుబాటులోకి సాండ్​ బజార్​.. ఎక్కడంటే..

Sand Bazaar : ఇసుకలో ఉండేది రెండు రకాలే..

ఇసుకలో ఉండేది రెండు రకాలేనని అనిల్​ ఈరవత్రి తెలిపారు. సాండ్​ బజార్​లో అమ్మే ఇసుకను మూసీ సాండ్​ అని పేరు పెడుతున్నారని, ఇది సరికాదన్నారు. కోర్ సాండ్​ అనేది మూసీ, కాళేశ్వరం, కరీంనగర్, కామారెడ్డి నుంచి కూడా వస్తుందని చెప్పారు. మూసీ నుంచి వచ్చింది ఇంత రేటు, కాళేశ్వరం నుంచి వచ్చింది ఇంత రేటు అని ఎవరూ అమ్మరని గుర్తు చేశారు. సాండ్​లో ఉండేది కోర్, ఫైన్ అనే రకాలేనని తెలిపారు.

Sand Bazaar | అందుబాటులోకి సాండ్​ బజార్​.. ఎక్కడంటే..
Sand Bazaar | అందుబాటులోకి సాండ్​ బజార్​.. ఎక్కడంటే..

Sand Bazaar : ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు

ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అనిల్​ తెలిపారు. ఫలితంగా గత రెండు, మూడు నెలలుగా ఇసుక మీద వచ్చే ఆదాయం రెండింతలు అయిందన్నారు. రోజుకు రూ.3 – 3.5 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.

Sand Bazaar | అందుబాటులోకి సాండ్​ బజార్​.. ఎక్కడంటే..
Sand Bazaar | అందుబాటులోకి సాండ్​ బజార్​.. ఎక్కడంటే..

Sand Bazaar : భారీగా పెరిగిన ఆదాయం

గత ప్రభుత్వంలో 2023, ఏప్రిల్ 1 నుంచి 2024, మార్చి 16 వరకు రూ.623 కోట్ల ఆదాయం వచ్చిందని అనిల్​ ఈరవత్రి గుర్తుచేశారు. అప్పుడు 52 రీచ్ లు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 16 వరకు కేవలం 26 రీచ్ ల నుంచి రూ. 703 కోట్ల ఆదాయం వచ్చిందని, అంటే రూ. 80 కోట్ల ఆదాయం పెరిగిందని తెలిపారు.

Advertisement