Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​ : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి గౌరారం వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. అనుమతులు తీసుకోకుండానే శనివారం పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరిపారు. జేసీబీలతో తవ్వకాలు జరిపి టిప్పర్లలో అక్రమ రవాణా చేశారు. అయినా అక్రమార్కులను అడ్డుకునే వారు లేకపోయారు. అధికార పార్టీ నాయకులే ఇసుక దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement