అక్షరటుడే, వెబ్ డెస్క్: Sand mining | ఇసుక క్వారీల (Sand reech) నిర్వాహకులు నిబంధలు తుంగలో తొక్కుతున్నారు. ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాలూర మండలం(saloora mandal) మందర్న శివారులోని మంజీర వాగులో ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం తాత్కాలిక అనుమతిలిచ్చింది. కానీ నిర్వాహకులు మాత్రం ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోవడం లేదు.
Sand mining | ఓవర్ లోడ్‌తో..
ప్రభుత్వం ఇసుక క్వారీకి అనుమతించకముందే సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub Collector vikas mahatho) అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఒక టిప్పర్‌లో ఏడు క్యూబిక్ మీటర్ల ఇసుక మాత్రమే నింపాలని, ఇసుక తీసుకెళ్తున్న వాహనంపై కార్పెట్ కప్పాలని సూచించారు. అయితే క్వారీల నిర్వాహకులు ఈ నిబంధనలు పాటించడం లేదు. ఓవర్ లోడ్‌తో టిప్పర్లను తరలిస్తున్నారు. క్వారీల యజమానులు నిబంధనలు పాటించకున్నా సంబంధిత రెవెన్యూ, పోలీసు, ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదు. కాగా క్వారీ వద్ద వే బ్రిడ్జి లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారీతిన ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
చర్యలు తీసుకుంటాం..
– వికాస్ మహతో, సబ్ కలెక్టర్
ఇసుక క్వారీల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి. లేకపోతే చర్యలు తీసుకుంటాం. ఇసుక నింపుకోవడానికి ప్రభుత్వానికి చెల్లించే రుసుము రూ.4,800 నుంచి రూ.2,300కు తగ్గించాం. టిప్పర్ లోడింగ్‌కు అధిక ధరలు తీసుకుంటున్న విషయం మా పరిధిలో లేదు. అది ప్రైవేట్ వ్యవహారం.