అక్షరటుడే, వెబ్డెస్క్ : Sangareddy | సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పలువురు వైద్యులపై కలెక్టర్(Collector) వల్లూరు క్రాంతి(Kranthi) కొరడా ఝళిపించారు.
ఆమె మంగళవారం ఆస్పత్రి(Hospital)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ అందుతున్న సేవలపై రోగులను ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. క్యాజువల్ లీవ్స్ ఎక్కువగా వాడిన 10 మంది డాక్టర్ల(Doctors)కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే లాంగ్ స్టాండ్ ఆబ్సెంట్లో ఉన్న మరో ఇద్దరు డాక్టర్లను హైదరాబాద్(Hyderabad) డీఎంఈ (DME) కార్యాలయానికి సరెండర్ చేయాలని ఆదేశించారు.