అక్షరటుడే, ఆర్మూర్: ప్రతి బూత్‌లో 300 సభ్యత్వాలు పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ నాయకులకు సూచించారు. సభ్యత్వ నమోదుపై ఆరు మండలాల నాయకులతో బుధవారం ఆర్మూర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పదాధికారులు పూర్తిస్థాయిలో సమయం కేటాయించి సభ్యత్వ నమోదును పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, భూపతిరెడ్డి, పుప్పల శివరాజ్, ద్యాగ ఉదయ్, గంగోని సంతోష్ పాల్గొన్నారు.