Advertisement

అక్షరటుడే, బిచ్కుంద: మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆస్పత్రి ఆవరణలోనే చెత్త, మెడికల్‌ వేస్ట్‌ పారవేస్తుండడంతో అధ్వానంగా మారింది. పందులు, కుక్కలు సంచరిస్తుండడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్న రోగం నయం చేసుకునేందుకు ఆస్పత్రికి వస్తే.. ఆస్పత్రి ఆవరణలో పారిశుధ్య లోపంతో కొత్త రోగాలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఆస్పత్రిలో చెత్త నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  FLAG MARCH | ర్యాపిడ్​ యాక్షన్ ఫోర్స్ కవాతు