అక్షరటుడే, కామారెడ్డి టౌన్ : అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో నూతన కోర్సుల్లో అడ్మిషన్లను వేగవంతం చేయాలని కార్మిక, ట్రెయినింగ్ ఫ్యాక్టరీ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో కొత్తగా 6 కోర్సులను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆరు కోర్సులకు సంబంధించి భర్తీ కోసం ప్రచారం చేయాలని ఐటీఐ ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఐటీఐ కన్వీనర్ ప్రమోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.